కంగనాకు టైమ్ వచ్చింది.. కౌంటర్ వేసింది..!

Kangana Ranaut reacts to anil deshmukhs resignation.అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిపై ట్విటర్‌లో కంగనా స్పందించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 6:11 AM GMT
Kangana Ranaut, Anil Deshmuk

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొద్దినెలల కిందట శివసేన నేతలతో పెద్ద గొడవనే పెట్టుకుంది. పలువురు శివసేన నేతలు కంగనాను తీవ్రంగా విమర్శించారు. కంగనా రనౌత్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా బదులు ఇస్తూనే వచ్చింది. తాజాగా మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలను గ్రహించిన కంగనా.. ఆ పార్టీ నేతలకు కాలేలా ట్వీట్లు చేసింది.

ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిపై ట్విటర్‌లో కంగనా స్పందించింది. సాధువులను హత్య చేసి.. స్త్రీలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదని కంగనా చెప్పుకొచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ను, శివసేన నేతలను ఉద్దేశించి హెచ్చరించింది. ఇక ముందు ఏం జరుగనుందో చూస్తూ ఉండాలని కంగనా తన ట్వీట్ లో చెప్పుకొచ్చింది.

మహారాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమ్ వీర్ సింగ్ స్వయంగా దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే‌కే ఉత్తరం రాసిన నేపథ్యంలో విషయం హైకోర్టు వరకు వెళ్లింది. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనని సోమవారం బాంబై హైకోర్టు స్పష్టం చేయడంతో హోమంత్రి తప్పనిసరై అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. పేలుడు పదార్థాల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజేను మంత్రి అన్నిరకాలుగా పరంబీర్ సింగ్ ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పురమాయించారంటూ పరంబీర్‌ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు.


Next Story