లోక్‌సభ ఎన్నికలపై కమల్‌హాసన్ కీలక కామెంట్స్

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 Feb 2024 6:26 AM GMT
kamal haasan,  lok sabha elections, tamil nadu,

లోక్‌సభ ఎన్నికలపై కమల్‌హాసన్ కీలక కామెంట్స్

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ సారి ఎలాగైనా మోడీ సర్కార్‌ను గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తోంది ఇండియా కూటమి. మరోవైపు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌ హాసన్‌ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకే పట్టు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సినీ తారల నుంచి కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కమల్‌ పార్టీతో అధికార పార్టీ డీఎంకే పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తు అంశంపై కమల్‌ హాసన్ స్పందించారు. సోమవరా ంచెన్నై ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తుపై రెండ్రోజుల్లో ప్రకటన ఉంటుందని వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన పనులు చకచకా సాగుతున్నట్లు వెల్లడించారు. మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. పొత్తుకు సంబంధించి రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్‌ కమల్‌ హాసన్ వెల్లడించారు.


Next Story