జనసైనికులను రెచ్చగొట్టే ధోరణిలో ఎంపీ అరవింద్ మాట్లాడం సరికాదు
Janasena Leaders Fires On BJP MP Aravind .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్త
By సుభాష్ Published on 28 Nov 2020 8:47 AM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. జనసేనతో జీహెచ్ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కోరడం వల్లే.. తెలంగాణలో పోటీని జనసేన విరమించుకుని బీజేపీకి మద్దతు ఇచ్చిందని దీనిపై.. ఎంపీ అరవింద్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడింది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన అభ్యంతరాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోనీ బీజేపీ అగ్ర నేతలు, తెలంగాణ రాష్ట్ర నేతలు కోరితేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన పార్టీ తప్పుకుందని, బీజేపీకి మద్దతు ఇచ్చిందని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబు కాదన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఒక్క ఓటు కూడా చీలకూడదనే సదుద్దేశంతో తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ నుంచి విరమించుకున్నారని చెప్పారు. పవన్ నిర్ణయంతో అప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు కొంత మేర నిరుత్సాహానికి లోనైనా అధ్యక్షుడి మాట శిరోధార్యంగా భావించి పోటీ నుంచి తప్పుకొన్నారని చెప్పారు. జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి. అంతే తప్ప జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం సరికాదన్నారు. ఎంపీ అరవింద్‌కు బీజేపీలో ఏం జరుగుతుందో తెలియదనుకుంట. అందుకే ఇలా పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా.. ఆ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.