జ‌న‌సేన‌కు ఊహించ‌ని షాక్‌.. సింబ‌ల్ పోయింది

Jana Sena loses its common symbol.తెలంగాణ రాష్ట్రంలో మినీ పురపోరుకు నగారా మోగిన సంగతి తెలిసిందే. రెండు కార్పొరేషన్లు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 2:33 AM GMT
జ‌న‌సేన‌కు ఊహించ‌ని షాక్‌.. సింబ‌ల్ పోయింది

తెలంగాణ రాష్ట్రంలో మినీ పురపోరుకు నగారా మోగిన సంగతి తెలిసిందే. రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమకు కామన్ గుర్తులను కేటాయించాలని జనసేన సహా పలు పార్టీలు కోరగా.. ఎన్నికల కమిషన్ నిరాకరించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో క‌నీసం 10 శాతం సీట్ల‌కు పోటి చేయ‌ని కార‌ణంగా జనసేన (గాజు గ్లాసు), ఎంసీపీఐ (యూ) (గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) పార్టీల అభ్యర్థులకు కామన్ గుర్తు కేటాయించలేమని ఎస్ఈసీ ఎం.అశోక్ కుమార్ స్పష్టం చేశారు.

కాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నామని.. ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వరాదనే పోటీ నుంచి వెనక్కు తగ్గామని.. ఇదే విష‌యాన్ని ఎస్ఈసీకి లేఖ రాఖ రాశారు జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే ఆయా అంశాలను తాము పరిశీలించామని.. జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు అశోక్‌కుమార్ తెలిపారు. 2025 నవంబర్‌ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత లేదని స్పష్టం చేశారు.




Next Story