లోక్‌సభ బరిలోకి గవర్నర్ తమిళిసై? అక్కడి నుంచే పోటీ?

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్‌ మొదలుపెట్టాయి.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 6:05 AM GMT
Governor Tamilisai, Lok Sabha, election, bjp,

లోక్‌సభ బరిలోకి గవర్నర్ తమిళిసై? అక్కడి నుంచే పోటీ?

లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు.. షెడ్యూల్‌ కంటే ఈ సారి ఎన్నికలు కాస్త ముందుగానే జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. దాంతో.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్‌ మొదలుపెట్టాయి. ఎక్కడ ఎవరిని పోటీకి దించాలనే దానిపై ఫోకస్‌ పెట్టాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌కు ప్రజలు షాక్‌ ఇవ్వడంతో సీట్లు తగ్గిపోయాయి. కానీ.. బీజేపీకి మాత్రం ఓటింగ్ శాతం పెరిగి ఏకంగా 8 స్థానాల్లో గెలిచారు.

ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి తెలంగాణపై ఎక్కువ ఫోకస్‌ పెట్టనుంది. 10 సీట్లు టార్గెట్‌గా ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నార.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓవర్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నారు. కాగా.. మంగళవారం గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె అమిత్‌షా తో సమావేశం అవుతారు. తాను ఎంపీ అభ్యర్థిగా పోటీచేసే అంశంపై చర్చించున్నారు. తమిళనాడులోని సౌత్‌ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి తమిళిసై పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

అయితే.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు. 2009లో చెన్నై నార్త్‌, 2019లో తూత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఒక్కసారి గెలవలేదు. మరోమూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా గెలుపు అందుకోలేకపోయారు. కానీ..ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం 2019లో సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. ఆ తర్వాత 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను తీసుకున్నారు. అయితే.. ఎంపీగా తమిళిసై పోటీ చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్‌షా గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే ఆమె బరిలో ఉంటారు. ఇక తమిళిసై అనుకున్నట్లుగా అవకాశం లభిస్తే తెలంగాణకు కొత్త గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుంది.

Next Story