కాంగ్రెస్ కు ఊహించని షాక్.. ఆయన కూడా వదిలిపెట్టాడు
Former law minister Ashwani Kumar quits Congress.కాంగ్రెస్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత
By M.S.R Published on 16 Feb 2022 12:17 PM ISTకాంగ్రెస్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ (69) రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో ఆయనకు ఉన్న 46 ఏళ్ల బంధం తెగిపోయింది. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. పార్టీకి దూరంగా ఉంటేనే జాతీయ ప్రయోజనాల కోసం మరింత మెరుగ్గా ఉండగలనని భావిస్తున్నట్టు ఆ లేఖలో స్పష్టం చేశారు.
అశ్వనీకుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారే అవకాశం ఉందన్నారు. పార్టీ అధినేతగా చెప్పుకుంటున్న వ్యక్తికి ప్రజల ఆమోదం లభించడం లేదని.. ప్రధాని మోదీ పనితీరు విషయంలో ప్రజలు సంతృప్తిగా లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయడం లేదన్న విషయానికి సమాధానం లేదని అన్నారు. చాలామంది సీనియర్ నేతలు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారికి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని అన్నారు. తనలాగా బయటకు వచ్చే శక్తి ఎంతమందికి ఉందన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరకపోవచ్చని పేర్కొన్నారు.
46 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం తర్వాత పార్టీని వదిలివేస్తున్నానని అన్నారు. ప్రజా సమస్యల విషయంలో మాత్రం తాను తన వాయిస్ ను వినిపిస్తూ ఉంటానని మాజీ రాజ్యసభ ఎంపీ చెప్పారు. రాజీనామాల పరంపరలో అశ్వనీకుమార్ రాజీనామాకు ముందు మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పార్టీ నేతలు కాంగ్రెస్‌ను వీడారు. వీరిలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్, లూయిసిన్హో ఫలేరో ఉన్నారు.