హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో లేనట్టే.. ద‌స‌రా త‌రువాత‌నే..!

Election commission clarity on Huzurabad BY Election.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడిని పెంచిన హుజూరాబాద్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2021 8:25 AM GMT
హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో లేనట్టే.. ద‌స‌రా త‌రువాత‌నే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడిని పెంచిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌పై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌(ఈసీ) స్పందించింది. పండుగ‌ల సీజ‌న్ ముగిసిన త‌రువాత‌నే ఉప ఎన్నిక నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరింద‌ని.. అక్టోబర్‌లో దసరా, నవంబర్‌లో దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సూచన చేసిందని ఎస్‌ఈసీ తెలిపింది. ఇక ఏపీలోని బ‌ద్వేల్ ఉప ఎన్నిక కూడా ద‌స‌రా త‌రువాతే ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. ఏపీ ప్ర‌భుత్వం కూడా ఉప ఎన్నిక‌ను వాయిదా కోరిన‌ట్లు చెప్పింది. అయితే.. ఈ ఎన్నిక‌లు ఏ తేదీన నిర్వ‌హిస్తామ‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. కాగా.. బంగాల్‌లోని భ‌వానీపూర్‌, జంగీపూర్‌, శంషేర్ గంజ్ స్థానాల‌కు, ఒడిశాలోని పిఫ్లి అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల‌ను ఈ నెల 30న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

ఆగస్టు 30 లోపు పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు, 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై అభిప్రాయాలు తెలియజేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం విదితమే. ఇలా అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story