పార్లమెంట్‌ వేదికగా రణగర్జనకు సీఎం కేసీఆర్ ప్లాన్‌

CM KCR Prepares Battle plan for monsoon session of Parliament.జూలై 18 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 8:20 AM IST
పార్లమెంట్‌ వేదికగా రణగర్జనకు సీఎం కేసీఆర్ ప్లాన్‌

జూలై 18 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రంలోని బీజీపీ ప్ర‌భుత్వం పై పోరాటానికి సీఎం కేసీఆర్ సిద్ద‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో క‌లిసి వ‌చ్చే అన్ని రాష్ట్రాల విప‌క్ష పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునే ప‌నిలో ఉన్నారు. శుక్ర‌వారం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఢీల్లి ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, బిహార్‌, యూపీలోని విప‌క్ష‌నేత‌లు తేజ‌స్వీ యాద‌వ్‌, అఖిలేశ్ యాద‌వ్‌లు, ఎన్సీపీ అధినేత ప‌వార్‌ల‌తో పాటు ప‌లువురు జాతీయ నాయ‌కుల‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీయేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై వేదింపులు, మ‌త విధ్వేషాల‌కు బీజేపీ చేస్తున్న య‌త్నాల‌ను ఎండ‌గ‌డ‌దామ‌న్నారు. దీనిపై ఆయా నేత‌లు సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

నేడు టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

ఈ నెల 18 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభ‌కానున్న నేప‌థ్యంలో నేడు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అవుతున్నారు. ఈరోజు(శ‌నివారం) మ‌ధ్యాహ్నాం ఒంటి గంట‌కు ప్రారంభ‌మ‌య్యే స‌మావేశంలో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, కేంద్రాన్ని నిల‌దీసే అంశాల‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి అన్ని రంగాల్లో న‌ష్టం చేసేలా కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర నిర‌స‌న తెలిపి పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాడాల‌ని ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఇలా ఉంది

-పెరుగుతున్న పెట్రోలు, LPG సిలిండర్లు, వరి రైతుల ధరలపై, రూపాయి విలువ పడిపోవడం, పెరుగుతున్న నిరుద్యోగం మరియు వ్యాపార సవాళ్లతో దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని హైలైట్ చేయాలి.

-ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం పతనం కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నందున ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య విలువలను కాపాడే ప్రయత్నాలను ముమ్మరం చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసి, ఎన్నికైన ప్రజాప్రతినిధులను బెదిరించే విధానాన్ని అంగీకరించబోమన్నారు.

Next Story