పవన్‌పై పరువు నష్టం కేసు నీతిమాలిన చర్య: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 4:11 PM ISTపవన్‌పై పరువు నష్టం కేసు నీతిమాలిన చర్య: చంద్రబాబు
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ కోసం జీవో కూడా జారీ చేసింది. పవన్‌పై ఏపీ ప్రభుత్వం పరువునష్టం కేసు వేయడంపై చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వానికి బుద్ధిలేని, నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరమే అంటున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలపైనే కాదు.. రాజకీయ పక్షాలు ప్రశ్నించినా కూడా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలని హితవు చంద్రబాబు పలికారు.
వాలంటీర్ల ద్వారా నిబంధనలకు వ్యతిరేకంగా వాలంటీర్ల ద్వారా ప్రజల డేటాను సేకరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అది ప్రశ్నించిన పవన్ కళ్యాణ్‌పై కేసులు పెడతారా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్ం సమాచారం సేకరించడమే తప్పు అని చంద్రబాబు అన్నారు. అలా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేయడం నీచపు చర్య అని అన్నారు. కేసు పెట్టా్లసి వస్తే, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న జగన్‌పై ముందు కేసు నమోదు చేయాలని చంద్రబాబు అన్నారు.
ఇక పరువు నష్టం కేసు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు. అసలు వైసీపీ ప్రభుత్వానికి పరువు ఎక్కడుందని ప్రశ్నించారు. నాలుగేళ్ల దిక్కుమాలిన పాలనలో మీ పరువు ఎప్పుడో మంటగలిసిపోయిందని విమర్శించారు. ప్రజలను ఎప్పుడు, ఎక్కడ నుంచి, ఎలా దోచుకోవాలని మాత్రమే ఆలోచిస్తారని విమర్శించారు. ఇలా దోచుకోవడంపై దృష్టి మరల్చి.. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, దాడులు చేస్తే తప్పులు దాగవు, ధైర్యం ఉంటే పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.