20లక్షల ఉద్యోగాలిస్తాం..నిరుద్యోగులకు రూ.3వేల భృతి: చంద్రబాబు
నెల్లూరులో టీడీపీ 'రా.. కదలిరా' బహరింగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 3:43 PM IST20లక్షల ఉద్యోగాలిస్తాం..నిరుద్యోగులకు రూ.3వేల భృతి: చంద్రబాబు
నెల్లూరులో టీడీపీ 'రా.. కదలిరా' బహరింగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలతో వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్న ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని చెప్పారు. ఏపీ ప్రజలంతా వైసీపీ పాలన బాధితులే అన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులను తీసుకురాలేకపోయిందని చంద్రబాబు అన్నారు.
ఎక్కడ చూసిన అక్రమాలు.. బెదిరింపులు కొనసాగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని ఆరోపించారు. గల్లా జయదేవ్ కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ సిద్ధం పేరుతో సమావేశం నిర్వహించారు.. ఆయన సిద్ధమంటే వైసీపీ టికెట్లు మాకొద్దంటూ నేతలు పారిపోతున్నారని మమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరు కదిలిరావాలని వైసీపీ నేతలకు పిలుపునిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ వర్గ ప్రజలు వైసీపీ పాలనలో సంతోషంగా లేరని చెప్పారు చంద్రబాబు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీది తొలిస్థానం అనీ.. అలాగే వారి ఆత్మహత్యల్లోనూ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి ఆయన్ని ఎన్నుకున్న ప్రజల తలపైనే చేయి వేసి అభివృద్ధిని పాతాళంలోకి నెట్టేశారని అన్నారు. దేశంలోని అందరూ సీఎంల కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తులే ఎక్కువ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని దీమా వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామనీ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఇక నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.