హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం కుట్ర: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మా జీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

By M.S.R  Published on  15 Jun 2024 7:15 PM IST
brs, Niranjan reddy,  ap cm Chandrababu,

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం కుట్ర

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు కుట్రతో తెలంగాణ గురించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కార్యాలయంలో జరిగిన ఎల్‌ఎస్‌ఎస్‌, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 60 లక్షల మంది బలం ఉన్న BRSను ఎవరూ ఏమీ చేయలేరని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ‘ఆత్మ’తో ముడిపడి ఉన్న పార్టీని ఎవరూ చీల్చలేరు. కనిపించని శక్తుల (బాబు) ప్రభావం ఉంటుందని.. అందుకే తెలంగాణ ‘వ్యతిరేక శక్తి’ ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల సలహాదారుగా సీఎం నియమించారన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ‘వైఫల్యాలను’ పార్టీ కార్యకర్తలు ఎండగట్టాలన్నారు.

Next Story