సొంత కుటుంబ సభ్యులతోనే కేసీఆర్‌కు ప్రమాదం: ఎంపీ అర్వింద్
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 7:45 PM ISTసొంత కుటుంబ సభ్యులతోనే కేసీఆర్‌కు ప్రమాదం: ఎంపీ అర్వింద్
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఏమయ్యారో అన్న పరేషానీ తమకు ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉందని అన్నారు. కేసీఆర్ తర్వాత సీఎం పదవి కోసం హరీశ్‌రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ క్రమంలో తన కంటే జూనియర్ కేటీఆర్‌కు సీఎం పదవి వస్తుందనే ఫ్రస్టేషన్‌లో మంత్రి హరీశ్‌రావు ఉన్నారని విమర్శించారు. రైల్వే స్టేషన్‌లో పిచ్చోడిలాగా హరీశ్‌రావు చిల్లరగా వ్యాఖ్యానించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గురించి కూగా ఎంపీ అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఎందుకు అంత ప్రేమో చెప్పాలన్నారు ధర్మపురి అర్వింద్.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కేసీఆర్ జిమ్మిక్కులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లోకి నాయకులను ఆయనే పంపిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తారని.. గెలిచాక వారిని మళ్లీ బీఆర్ఎస్‌లోకి తీసుకుంటారని అన్నారు. ప్రధాని మోదీ కామెంట్స్‌పై ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు రావడంతో బీఆర్ఎస్ నాయకులకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదని విమర్శలు చేశారు. పసుపు బోర్డు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి చూపించామని చెప్పారు. ఈ సందర్భంగా పసుపు బోర్డుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు.