23 సూత్రాలతో బీజేపీ 'బెంగాల్‌ మిషన్‌'

BJP Mission Bengal .. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ను ఎలాగైన చేజిక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచి

By సుభాష్  Published on  19 Nov 2020 5:57 AM GMT
23 సూత్రాలతో బీజేపీ బెంగాల్‌ మిషన్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ను ఎలాగైన చేజిక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచి ఎత్తుగడలు వేస్తోంది. 'మిషన్‌ బెంగాల్‌' పేరుతో బూత్‌ స్థాయి వ్యూహాన్ని ఖరారు చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 23 సూత్రాల ప్రణాళికలను రూపొందించారు. వీటి అమలు తీరును పరిశీలించడానికి ఆయన ప్రతినెలా ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌ను వశం చేసుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తోంది. తాజాగా బీహార్‌ను కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ను కూడా కైవసం చేసుకునే విధంగా పక్కా ప్రణాళికలు రచిస్తోంది.

బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు

- బూత్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయి. రిజర్వుడు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పార్టీలో చేర్చుకోనున్నారు.

- బలాల ఆధారంగా బూత్‌లను ఎ,బి,సి,డి వర్గాలుగా విభజించనున్నారు.

- బూత్‌ సామర్థ్యాన్ని డి నుంచి సికి, సి నుంచి బికి, బి నుంచి ఏకు పెంచేలా కార్యకర్తలకు తగిన పక్కా ప్రణాళికలు రూపొందించడం. ఈ విషయంలో ఆయా సామాజిక వర్గాలకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారు.

- కార్యచరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన కనీసం 20 మందిని పార్టీలో చేర్చుకునే విధంగా ప్రణాళికలు.

- ప్రధాని మోదీ చేసే మన్‌కీబాత్‌ , ఇతర నాయకుల ప్రసంగాలను ప్రజలు వినేలా ఏర్పాటు చేయాలి.

- పార్టీ తరపున కనీసం ఆరు కార్యక్రమాలు నిర్వహించాలి.

- బూత్‌ పరిధిలో కనీసం ఐదు ప్రాంతాల్లో పార్టీ గుర్తు కమలం కనిపించేలా చిత్రీకరించాలి.

- మోటారు సైకిళ్లు ఉన్న కనీసం ఐదుగురు పార్టీ కార్యకర్తలను గుర్తించాలి.

- దేవాలయాల పూజారులు, సాధువులు, సహకార బ్యాంకులు, పాల సంఘాల నాయకులు, సర్పంచ్‌లు, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వారితో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలి.

- ఆయా బూత్‌ పరిధిలోని ఓటర్లు, కార్యకర్తలు తమ ఫోన్లలో నమో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి.

- ప్రతి వీధి, ప్రతి ఓటరును విడిచిపెట్టుండా ప్రచారం చేయాలి.

- గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బూత్‌ల వారీగా సేకరించి వాటిని విశ్లేషించాలి. అందుకు తగినట్లుగా వ్యూహాలను రూపొందించాలి.

- ఇలా ముందస్తు ప్రణాళికల ద్వారా బీజేపీ వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తోంది.

Next Story