కేంద్ర కేబినెట్‌లోనే ఉంటా.. ఆ వార్తలు అవాస్తవం: సురేశ్‌ గోపి

కేంద్ర మంత్రివర్గం నుంచి సురేష్‌ గోపి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  10 Jun 2024 4:18 PM IST
bjp, minister suresh gopi, clarity,

కేంద్ర కేబినెట్‌లోనే ఉంటా.. ఆ వార్తలు అవాస్తవం: సురేశ్‌ గోపి 

కేంద్ర మంత్రివర్గం నుంచి సురేష్‌ గోపి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాతో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ ప్రచారంపై సురేష్ గోపి స్పందించారు. ఒక క్లారిటీ ఇచ్చారు. తాను కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశాక.. తనకు పదవిపై ఆసక్తి లేదని వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పారు. ఇది కొందరు తప్పుడు వ్యక్తులే ఇచ్చిన సమాచారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను పనిచేస్తానని స్పష్టం చేశారు కేరళ అభివృద్ధికి, శ్రేయస్సు కోనం తాను నిత్యం పనిచేస్తూ ఉంటానని కేంద్రమంత్రి సురేశ్ గోపి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేశారు.

కేరళ నుంచి బీజేపీ తొలి లోక్‌సభ ఎంపీగా సురేశ్‌ గోపి ఎన్నిక అయ్యారు. గోపి త్రిస్సూర్‌లో 74వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. లోక్‌సభ ఎంపీగా ఎన్నిక అయ్యే ముందు సురేశ్ గోపి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. కేంద్ర మంత్రిగా సురేశ్‌ గోపి.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. సురేశ్‌ గోపి ఎక్స్‌లో పెట్టిన పోస్టుతో ఫేక్ ప్రచారానికి తెరపడింది.

కాగా.. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఎన్డీఏలోని మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర మంత్రుల్లో 43 మంది పార్లమెంట్‌లో మూడు సార్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారే. ఇక 39 మాత్రమే ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఓబీసీ నుంచి 27 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయి.

Next Story