అక్టోబర్ 2వ తేదీన కొత్త పొలిటికల్ పార్టీ: ప్రశాంత్ కిశోర్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు.

By Srikanth Gundamalla  Published on  29 Sep 2024 11:52 AM GMT
అక్టోబర్ 2వ తేదీన కొత్త పొలిటికల్ పార్టీ: ప్రశాంత్ కిశోర్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీన బీహార్‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు ప్రశాంత్ కిశోర్. పార్టీ పేరు, నాయకత్వంతో పాటు అన్ని వివరాలు అదే రోజున వెల్లడిస్తానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

కాగా.. ‘జన సురాజ్’ పేరుతో బీహార్‌లో ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సంరద్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ‘అక్టోబరు 2న కొత్త పార్టీ ‘జన సూరజ్‌’తో పాటు నాయకత్వ ప్రకటన గురించి మీరు తెలుసుకుంటారు. నేను నాయకుడిని కాదు. నాయకుడు కావాలని ఎప్పుడూ ఆశించలేదు. అక్టోబర్ 2న ఏర్పాటవుతున్న ఈ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిగా ఉండను. ప్రజలు నాయకత్వ పాత్ర పోషించాల్సిన సమయం ఇది’అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. 2022 అక్టోబర్‌ 2న ‘జన సూరాజ్’ పాదయాత్ర చేపట్టారు. మొదటి దశలో భాగంగా బీహార్‌లో 60 శాతం ప్రాంతాలను పూర్తి చేసినట్లు ప్రశాంత్ కిశోర్ చెప్పారు. బీహార్‌లోని ప్రతి మూలకు ప్రధానంగా మూడు ఉద్దేశాలు నెరవేర్చడం కోసమే వెళ్తున్నామని ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత కూడా ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిసింది.

Next Story