పవర్ లేనోళ్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు?: బండ్ల గణేష్

తెలంగాణలో శ్వేతపత్రం వర్సెస్‌ స్వేద పత్రం రాజకీయాలు నడుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 4:55 AM GMT
bandla ganesh, comments,  brs, power point presentation ,

పవర్ లేనోళ్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు?: బండ్ల గణేష్

తెలంగాణలో శ్వేతపత్రం వర్సెస్‌ స్వేద పత్రం రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్‌ గత ప్రభుత్వం చేసిన తప్పులను చూపిస్తే.. స్వేతపత్రం పేరుతో తామేం చేశామో చెప్పింది బీఆర్ఎస్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన పనుల గురించి వివరించారు. అయితే.. తాజాగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.

బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేస్తారు ఇదీ అందరికీ తెలిసిందే. ఆయన నేరుగా పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం ప్రచారం చేశారు. రెండు దఫాలు పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్‌పై బండ్ల గణేష్‌ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవర్ లేని వారికి పవర్‌ ప్రజెంటేషన్‌ ఎందుకు అని ప్రశ్నించారు. మాట్లాడితే గత పాలకులు.. గత పాలకులు ఎన్ని సార్లు మాట్లాడుతారని అన్నారు. ఆ మాట వినీ వినీ విసుగు వస్తోందని అన్నారు. గత పదేళ్ల న ఉంచి తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అయితే.. గత ప్రభుత్వం ఎంత దోచుకుందో అనే విషయం తాము చెప్తామన్నారు బండ్ల గణేష్. ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగారో.. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో.. మీ నాయకులు.. మీ జీవన విధానం ఎంత మరిపోయిందో తెలుసని అన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు ఎంత వెనుకబడి పోయారో కూడా తెలుసుని చెప్పారు. కాంగ్రెస్‌ చెప్పింది.. జనం నమ్మారనీ.. అందుకే అధికారం కట్టబెట్టారని అన్నారు బండ్ల గణేష్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు కూడా అవ్వడం లేదు.. అప్పుడే ఎందుకు అంత ఆతృత అని ప్రశ్నించారు. ఎందుకంత బాధ..? ఎందుకంత భయం అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ అద్భుతంగా పాలన సాగిస్తుందని ఈ సందర్భంగా బండ్ల గణేష్ దీమా వ్యక్తం చేశారు.


Next Story