30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పిన బండి సంజయ్

Bandi Sanjay Anout TRS Mlas. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి దూకుడు మీద ఉంది. ఇప్పటికే పలువురు నాయకులను భారతీయ జనతా పార్టీ తమ వైపు తిప్పుకుంది. తాజాగా 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పిన బండి సంజయ్.

By Medi Samrat  Published on  2 Jan 2021 6:51 AM GMT
Bandi Sanjay

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి దూకుడు మీద ఉంది. ఇప్పటికే పలువురు నాయకులను భారతీయ జనతా పార్టీ తమ వైపు తిప్పుకుంది. త్వరలో ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చెప్పుకొచ్చారు. అందులో 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని బాంబు పేల్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ తమతో 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారని అన్నారు. గ్రేట‌ర్ కార్పొరేటర్లు కూడా బండి సంజయ్ దారిలో ఉన్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యేలే 30 మంది అంటే.. కార్పొరేట్ల లెక్క ఎంతో క‌దా అని ప్రజలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇవి నిజమైన కామెంట్లా లేక కొందరిని కార్నర్ చేయడానికే ఈ పని చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. బండి సంజ‌య్ చెప్పిన 30 మంది ఎమ్మెల్యేల లెక్క‌గానీ నిజ‌మే అయితే మాత్రం టీఆర్ఎస్ కు టెన్షన్ మొదలవ్వడం పక్కా..!

జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి నెల రోజులు గడిచినా రాజ్యాంగం ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని బండి సంజయ్ అంటున్నారు. టీఆర్ఎస్ సర్కారు, ఎస్ఈసీ దొంగనాటకాలు ఆడుతున్నాయని.. ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. కేసీఆర్, ఓవైసీ తీసుకున్న నిర్ణయాలనే ఎస్ఈసీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎంఐఎం పార్టీ సహకారంతోనే టీఆర్ఎస్ కొన్నయినా సీట్లను గెలిచింది.. అడ్డదారిలో గెలిచారు.. గెలిచిన తర్వాతయినా ప్రజల ఆలోచనలను గమనించి.. ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవడం లేదని అన్నారు. మాకు రెండు నెలల టైమ్ ఉందని టీఆర్ఎస్ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని.. మరి మూడు నెలల ముందే ఎన్నికలను ఎందుకు నిర్వహించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు బండి సంజయ్.


Next Story