ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూసింది.

By Srikanth Gundamalla  Published on  18 Jun 2024 4:00 AM GMT
andhra pradesh, ycp, jagan, sensational comments,  evm,

ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూసింది. అధికారాన్ని కోల్పోవడమే కాదు.. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయింది. మెజార్టీ స్థానాల నుంచి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్‌ షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి.. ఘన విజయాన్ని అందుకున్నాయి. 165 అసెంబ్లీ స్థానాల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాయి. సీఎంగా చంద్రబాబు మరోసారి బాధ్యతలు తీసుకున్నారు.

కాగా..రాష్ట్రంలో ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఈవీఎంల గురించి సంచలనాత్మక పోస్టు పెట్టారు. న్యాయం జరగడం మాత్రమే కాదు.. అందించినట్లు స్పష్టంగా కనిపించాలి అన్నారు. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటం మాత్రమే కాదు.. నిస్సందేహంగా అది ప్రబలంగా ఉన్నట్లు కనిపంచాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ది చెందిన ప్రజాస్వామ్యంలో ఎన్నికల పద్దతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడంలో మనం కూడా అదే దిశగా పయనించాలంటూ జగన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

2019 ఎన్నికల తర్వాత కూడా ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు జగన్‌ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యమన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Next Story