ఆ మూడింటితో మోదీ తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 8:00 AM GMT
ఆ మూడింటితో మోదీ తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించాడా..?

ముఖ్యాంశాలు

  • మోదీ హయాంలోనే ఆర్టికల్ 370 రద్దు
  • మోదీ పాలనలోనే ట్రిపుల్ తలాక్ రద్దు
  • మోదీ పీఎంగా ఉన్నప్పుడే అయోధ్య సమస్యకు పరిష్కారం

మోదీ హయాంలోనే అయోధ్య వివాదానికి పరిష్కారం లభించింది. దాదాపు 134 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోంది. అయోధ్యలోని ఆ భూమి మాదని ఒక వర్గం...కాదు మాదని మరో వర్గం కోర్ట్‌ ల్లో కొట్లాడుతూ వచ్చాయి.అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లింది. దశాబ్దాలుగా పరిష్కార రహితంగా ఉన్న ఈ సున్నితమైన వివాదానికి.....సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాముడికే చెందుతుందని తేల్చిచెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేతను తప్పుబట్టిన న్యాయస్థానం ....మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా గా ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది. మోదీ హయాంలోనే ఇంతటి కీలక సమస్యకు పరిష్కారం లభించడం ...బీజేపీ సర్కార్ కు పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. తాజా తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్రానికి దక్కాయి. తీర్పుకు ముందు మోదీ వ్యవహరించిన తీరు అందరితోనూ శభాష్ అనిపించేలా చేస్తోంది. తీర్పు ఎలాంటిదైనా అందరూ స్వాగతించాలని....రాబోయే తీర్పు గెలుపు, ఓటములకు సంబంధించినది కాదని మోదీ పిలుపు ఇవ్వడం ....ప్రతిఒక్కర్నీ ఆకట్టుకుంది. ఎన్నో క్లిష్ట సమస్యలకు మోదీ హయాంలోనే పరిష్కారం రావడం కమలదళం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇక 370 ఆర్టికల్ రద్దుతో మోదీ పేరు ఇండియాలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. దాదాపుగా 70 ఏళ్ల నుంచి ఉన్న ఆర్టికల్‌ ను మోదీ రెండో సారి అధికారంలోకి రాగానే రద్దు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా మోదీ వెనక్కి తగ్గలేదు. కశ్మీర్ నేతలను గృహనిర్బంధం చేసి ఆర్టికల్ 370 రద్దు చేశారు. రద్దను ప్రపంచదేశాధినేతలు ఒప్పుకునేలా చేశారు. 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌ ప్రజలకు మేలు చేకూరుతుందని ప్రపంచదేశాలను ఒప్పించగలిగారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంత ఏడ్చినా..ఆయనను పట్టించుకునే వారే కరువయ్యారు. పాకిస్థాన్‌ ప్రజలు కూడా ఇమ్రాన్‌ కశ్మీర్ రాగంపై మండపడ్డారు. దేశంలో అనేక సమస్యలు పెట్టుకుని..కశ్మీర్‌ రాగం ఆలపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో..ఇమ్రాన్‌కు సొంత ఇంట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. చివరకు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ కశ్మీర్ భారత్ భూభాగమేని ఒప్పుకున్నారు.

ఇక..ట్రిపుల్ తలాక్‌ రద్దుతో ముస్లిం మహిళల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కడో ఉండి తలాక్‌ చెప్పి విడిపోవడాన్ని మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇదే విషయాన్ని..మోదీ ప్రధాని అయ్యాక చాలా సార్లు బహిరంగంగానే చెప్పారు. అనేక వాదనలు తరువాత సుప్రీం కోర్ట్ ట్రిపుల్ తలాక్‌ను కొట్టేసింది. ట్రిపుల్ తలాక్‌ చెబితే కఠిన శిక్షకు ఆదేశాలిచ్చింది.

పై మూడు కూడా ఏళ్లగా భారతీయ సమాజానికి పెద్ద సమస్యగా ఉన్నారు. ఈ మూడు మోదీ హయాంలోనే పరిష్కారమయ్యాయి. దీంతో మోదీకి రాజకీయంగా తిరుగులేని శక్తిగా అవతరించాడనే చెప్పాలి.

Next Story