హైద‌రాబాద్ : మావోయిస్టుల‌తో సంబంధాలు ఉన్నాయ‌నే అనుమానంతో ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్రొఫెసర్ కాశీమ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేప‌ట్టారు. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. కాశీమ్ నూతనంగా విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ కాశీమ్ ను ఏ-2గా చేర్చుతూ 2016లో ములుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీంతో ఈ కేసుకు సంబంధించి మరోసారి సెర్చ్ వారెంట్‌తో కాశీమ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు.

Newsmeter.Network

Next Story