భారీగా పట్టుబడ్డ నగదు
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2020 7:11 AM GMTవిజయవాడ గవర్నర్ పేట పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. నగరంలోని చల్లపల్లి బంగ్లా కూడలిలో గవర్నర్ పేట సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ మారుతీ వ్యాన్ అనుమానాస్పదంగా వెళుతూ పోలీసుల కంటపడింది. వెంటనే వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా.. బ్యాగ్‌లో సరైన పత్రాలు లేని రూ. 70 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్‌లో డబ్బు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. డబ్బును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకి అప్పగించారు.
Next Story