తాడేపల్లిలో పోలీసుల కార్డెన్‌సెర్చ్‌.. సీఎం నివాసానికి దగ్గరలో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 6:20 AM GMT
తాడేపల్లిలో పోలీసుల కార్డెన్‌సెర్చ్‌.. సీఎం నివాసానికి దగ్గరలో..?

గుంటూరు: తాడేపల్లి పట్టణం కేయల్‌ రావు కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్‌ నిర్వహించారు. కాలనీలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక స్విఫ్ట్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. 200 గ్రామలు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ ఈశ్వర్‌రావు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. డిఎస్పీ దుర్గా ప్రసాద్‌, పలువురు సీఐలు, ఎస్సైలతో పాటు 100 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. సీఎం జగన్‌ నివాస ప్రాంతానికి చేరువలో ఉండటంతో పాటు పలువురు వీఐపీలు ఉండే ప్రాంతం కావడంతో కార్డెన్ సెర్చ్‌ నిర్వహించామని అడిషనల్ ఎస్పీ ఈశ్వర్‌రావు తెలిపారు.

Next Story
Share it