ఢిల్లీ: తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది.. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను.” అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలూ, సుఖ సంతోషాలు, ఐష్టెశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.