ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యాప్ లేకుండా పర్యటనలు చేస్తున్నారు. మొన్నటివరకు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన మోదీ… నిన్న సైనికుల దగ్గరకు వెళ్లి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఇవాళ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 31 వరకు అక్కడే ఉంటారు. 3 రోజుల పర్యట నలో సదస్సులు, సమావేశాలతో మోదీ బిజీబిజీగా గడపనున్నారు. సౌదీలో జరిగే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్ వార్షిక సదస్సులో మోదీ ప్రసం గిస్తారు. అనంతరం సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌, యువరాజులతో మోదీ సమావేశమవుతారు. భారత్-సౌదీ మధ్య ద్వైపాక్షిక అంశాలపై వారితో చర్చిస్తా రు. ఈ సందర్భంగా సౌదీ-భారత్ మధ్య దాదాపు 12 ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందులో పునరుత్పాదక ఇంధనం, రక్షణ, పౌర విమానయాన రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి డీల్స్ కుదరనున్నాయి.

ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. 2016లో మోదీ తొలిసారి సౌదీకి వెళ్లారు. సౌదీతో బంధాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు పెట్టుబడులు ఆకర్షించడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మనదేశానికి వచ్చారు. పెట్రో కెమికల్స్, మౌలిక సదుపా యాలు, మైనిం గ్ రంగాల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించారు. పనిలో పనిగా కశ్మీర్‌లో పాక్‌ చేష్టలు గురించి కూడా చర్చించే అవకాశముంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.