ఢిల్లీ:  మూడు రోజుల పర్యటప నేపథ్యంలో ప్రధాని మోదీ థాయిలాండ్‌ చేరుకున్నారు. మూడో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సు, 14వ తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్‌ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

గురునానక్‌ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

అనంతరం థాయిలాండ్‌ ప్రధాని ప్రయుత్‌ ఛాన్‌ ఓ ఛా ప్రత్యేక ఆహ్వానం మేరకు బ్యాంకాక్‌లో పర్యటిస్తారు. రేపు మోదీ-ప్రయుత్‌లు భేటీ కానున్నారు. తీర ప్రాంతాల భద్రత, వాణిజ్యం వంటి పలు అంశాల్లో సహాయ సహకారాలపై చర్చించనున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.