ప్లీజ్..మాకూ భోజనం పెట్టండి..

By రాణి  Published on  29 March 2020 1:36 PM GMT
ప్లీజ్..మాకూ భోజనం పెట్టండి..

కరోనా పుణ్యమా అని..ప్రజలకు సరిగ్గా తినడానికి తిండి కూడా దొరకట్లేదు. రోజూ కూలీ చేసుకుని కుటుంబాలను పోషించుకునేవారి పరిస్థితి మరీ దారుణమైంది. అందేటి ? ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తోంది. రూ.1500 నిత్యావసరాలకు కూడా ఇస్తుంది కదా అంటారా ? అది కేవలం రేషన్ కార్డుదారులకు మాత్రమే కదా. అలా రేషన్ కార్డులు లేక పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ, అటు ఆంధ్రాకు వచ్చి పనులు చేసుకుంటున్నవారి సంఖ్య ఎక్కువే. ఇలాంటివారందరికీ వాళ్ల సొంత రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డులుంటాయి గానీ..ఇక్కడ ఉండవ్ కదా. అలాగని సొంత ఊళ్లకు వెళ్లేందుకూ అనుమతులివ్వట్లేదు.

Also Read : కరోనా మందు : ఫేస్ బుక్ 25 మిలియన్ డాలర్ల సాయం

ప్రజల పరిస్థితే ఇలా ఉంటే..నోరు లేని జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో కదా. మామూలుగా అయితే వీధుల్లో తిరిగే గ్రామ సింహాలకు ఒకింట్లో కాకపోతే మరో ఇంట్లో మిగిలిన అన్నమో, బిస్కెట్లో, పాలో పెడుతుంటారు. కానీ..కరోనా ప్రభావంతో ప్రజలు తినడానికే తిండి కరువయ్యే పరిస్థితి ఎదురైతే..వాటికెవరు తిండిపెడతారు చెప్పండి. పైగా లాక్ డౌన్ తో రోడ్లపై జనాలే కనిపించడం లేదు. ఎక్కడైనా ఒకరో ఇద్దరో కనిపిస్తే..వాళ్లైనా ఏదొకటి పెట్టకపోతారా అని దీనంగా చూస్తున్నాయి మూగజీవాలు. ఇలాంటి తరుణంలోనే ఓ వ్యక్తి ఓ శునకం నోటిలో ''Please Leave Food And Water For us'' అని రాసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అతడు పోస్ట్ కైతే నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు గానీ..వారిలో ఎంతమంది ఇలాంటి వాటికి ఆహారం పెడతారు ? మనుషులైతే నోరుంది కాబట్టి ప్రభుత్వాన్ని వేడుకుంటారు. నోరులేని జీవులు అవి ఎవరిని అడుగుతాయి చెప్పండి. అందుకే మీరైనా..మీ వీధుల్లో ఉండే జీవాలకు మీకుతోచినంత ఆహారం పెట్టండి. గుర్తుంచుకోండి..కుక్కల వల్ల కరోనా రాదు. అలాంటి ప్రచారాలను నమ్మకండి.

Also Read : కరోనా వ్యాప్తికి మూలకారణమేంటో చెప్పిన..మొదటి పేషెంట్

Next Story