చిత్తూరు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఎదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తునే ఉంది. మొన్న బూందీ పోటులో అగ్ని ప్రమాదం సంభవిస్తే, నిన్న శ్రీవారి ప్రసాదంలో ప్లాస్టిక్‌ కవర్‌ ప్రత్యక్షమైంది. రెడ్డప్ప రెడ్డి అనే భక్తుడు కౌంటర్‌లో తీసుకున్న లడ్డూ ప్రసాదంలో ప్లాస్టిక్‌ కవర్‌ కనపడింది. దీంతో ఒక్క సారిగా కంగుతిన్న శ్రీవారిభక్తుడు రెడ్డప్ప.. అక్కడి అధికారులను నిలదీశాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆలయ ప్రతిష్టను తగ్గించేందుకే కొందరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అన్న ప్రసాదాల విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు వాపోతున్నారు. లడ్డు తయారీని అధికారులు పరిశీలించానలి భక్తులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.