వాహనదారులకు షాక్‌ ఇస్తున్న చమురు ధరలు.. పెట్రోల్‌పై రూ. 8.03, డీజిల్‌పై రూ. 8.27 పెంపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 6:54 AM GMT
వాహనదారులకు షాక్‌ ఇస్తున్న చమురు ధరలు.. పెట్రోల్‌పై రూ. 8.03, డీజిల్‌పై రూ. 8.27 పెంపు

దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా ఆదివారం కూడా పెట్రోల్‌ ధర లీటరుకు 35 పైసలు, డీజిల్‌ ధర లీటరుకు 56 పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇంధన వరుసగా పెరుగుతూ వస్తుండడంతో.. గడిచిన 15 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌కు రూ.8.03, డీజిల్‌ కు రూ.8.27 పైసలు మేర ధరలు పెరిగాయి. అసలే కరోనా కష్టకాలంలో.. ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు :

హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.82.25, డీజిల్ రూ.76.07

న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 79.23, డీజిల్ రూ.78.27

ముంబై : పెట్రోలు ధర రూ. 86.05, డీజిల్ రూ.76.69

చెన్నై: పెట్రోలు ధర రూ. 82.27, డీజిల్ రూ.75.69

భారత్‌లో పెట్రోల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు?

ముడి చమురు ధరలు, రీఫైనరీల ఖర్చు, మార్కెటింగ్ కంపెనీల మార్జిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్, వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇవన్నీ కలిపిన తర్వాతే అది సామాన్యుడు భరించాల్సిన రిటైల్ ధర అవుతుంది.

Next Story