టాప్ 10 ఎక్స్ఛేంజీల్లో మనం చేరిపోయాం.. విలువ ఎంతంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 7:39 AM GMT
టాప్ 10 ఎక్స్ఛేంజీల్లో మనం చేరిపోయాం.. విలువ ఎంతంటే?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్టాక్ ఎక్స్ఛేంజీలులకు సంబంధించి భారత్ మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 ఎక్స్ఛేంజీలల్లో స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఎక్స్ఛేంజీలుల్లో లిస్టు అయిన ఆయా కంపెనీల విలువ ఆధారంగా లెక్కతేలుస్తారు. ఈ ప్రకారంగా చూస్తే.. మన బీఎస్ఈ తాజాగా టాప్ టెన్ లో ఒకటిగా మారింది.

ఈ జాబితాలో అగ్రస్థానంలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ నిలిస్తే.. రెండో స్థానంలో నాస్ డాక్.. మూడో స్థానంలో టోక్యో స్టాక్ ఎక్ఛ్సేంజ్ నిలిచింది. ఈ పట్టికలో భారత్ పదో స్థానంలో నిలిచింది. ఈ ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న కంపెనీల మార్కెట్ విలువ మొత్తం 1.7లక్షల కోట్ల డాలర్లుగా లెక్క తేల్చారు.

దీన్ని మన రూపాయిల్లో చూస్తే సుమారు రూ. 129.2లక్షల కోట్లుగా చెప్పాలి. ఐదు కోట్ల మంది నమోదిత మదుపుదార్లు బీఎస్ఈలో ఉన్నారు. ఇక.. చార్ట్ లో అగ్రస్థానంలో ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ విలువ 19.3 లక్షలకోట్ల డాలర్లుగా చెబుతున్నారు. దీని విలువ మన రూపాయిల్లో లెక్క కడితే రూ. 1467 లక్షల కోట్లుగా తేలుతుంది.

టాప్ టెన్ ఎక్ఛ్సేంజ్ లు.. వాటి విలువ చూస్తే..

1. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ -‌ 19.3లక్షల కోట్ల డాలర్లు

2. నాస్ డాక్ - 13.8లక్షల కోట్ల డాలర్లు

3. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ - 5.7లక్షల కోట్ల డాలర్లు

4. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ - 4.9 లక్షల కోట్ల డాలర్లు

5. హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ - 4.4 లక్షల కోట్ల డాలర్లు

6. యూరో నెక్ట్స్ - 3.9 లక్షల కోట్ల డాలర్లు

7. షెన్ జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ - 3.5లక్షల కోట్ల డాలర్లు

8. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ - 3.2లక్షల కోట్ల డాలర్లు

9. టొరొంటో స్టాక్ ఎక్స్ఛేంజ్ - 2.1లక్షల కోట్ల డాలర్లు

10. బీఎస్ఈ - 1.7లక్షల కోట్ల డాలర్లు

Next Story