దేశ వ్యాప్తంగా పెట్రోల ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 11వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా బుధవారం కూడా పెట్రోలుపై 55 పైసలు, డీజిలు పై 60పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలు పై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పెరిగినట్టయింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు

  • హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07
  • న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.28, డీజిల్ రూ.75.79
  • ముంబై : పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్ రూ.74.32
  • చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్ రూ.73.69

సుభాష్

.

Next Story