హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బ.. ఇప్పుడు చమురు వాణిజ్యానికి తగిలింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పతనం అవుతున్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడ తగ్గనంతగా తక్కువ చమురు ధరలు పడిపోయాయి. గత నెల 13 నెలలతో పోలిస్తే.. ఈ రోజు ధర చాలా కనిష్టం. చమురు ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నాలుగు రూపాయలు తగ్గాయి.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 71.96, ముంబైలో రూ.77.62, చెన్నైలో రూ.74.75, బెంగళూరులో రూ.74.41, హైదరాబాద్‌లో రూ.76.47గా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్‌ డిజీల్‌ ధర రూ. 64.60, ముంబైలో రూ.67.69, బెంగళూరులో రూ.66.79, చెన్నైలో రూ.68.21, హైదరాబాద్‌లో రూ.70.37గా ఉన్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో.. పెట్రోల్‌, డీజిల్‌ వాహనదారులకు స్వల్ప ఊరట లభిస్తోంది. పెట్రోల్‌ ధర 5 నెలల కనిష్టానికి తగ్గగా.. డీజిల్‌ 7 నెలల కనిష్టానికి తగ్గాయి. ఇదిలాఉంటే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.38 శాతం తగ్గడంతో 52.08 అమెరికన్‌ డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ ధర 1.52 శాతం తగ్గుదలతో 47.99 డాలర్లకు క్షీణించింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.