తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

By సుభాష్  Published on  8 Feb 2020 4:34 PM IST
తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఇప్పటి వరకు పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడో రోజు కూడా కిందకు దిగివచ్చింది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు తగ్గింది. దీంతో ఫిబ్రవరి నెలలో మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై 82 పైసలు, డీజిల్‌పై 85 పైసలు తగ్గింది. జనవరి నుంచి ఇంధన రేట్లు తగ్గిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ ముడి చమురుకు కూడా తాకాయి. చమురు డిమాండ్‌ అధికంగా ఉండే చైనాలో కరోనా వైరస్‌ కారణంగా చమురు వాణిజ్యం తీవ్ర ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ ముడి చమురు ధర గత వారం పడిపోయింది.

దేశంలో లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలు ఇలా..

ఢిల్లీ - పెట్రోల్‌ రూ.72.45, డీజిల్‌ రూ.65.43

చెన్నై - రూ.75.27, డీజిల్‌ రూ.69.10

ముంబాయి - 78.11, డీజిల్‌ 68.57

కోల్‌కతా - 75.13, డీజిల్‌ రూ. 67.79

హైదరాబాద్‌ - రూ. 77.08, డీజిల్‌ రూ.71,35

విజయవాడ - రూ. 76.63, డీజిల్‌ రూ. 70.91

Next Story