బ్రేకింగ్: కూతురు కోసం ఢిల్లీ హైకోర్టుకెళ్లిన నిజామాబాద్ వాసులు
By సుభాష్ Published on 28 Feb 2020 5:42 PM IST
ఢిల్లీలో ఆధ్యాత్మిక ఆశ్రమంలో తమ కూతురును బంధించారని నిజామాబాద్‌కు చెందిన తల్లిదండ్రులు మీనవతి, రాంరెడ్డిలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురు తరహాలోనే 168 మంది అమ్మాయిలు ఆశ్రమంలో ఉంచారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్ పై అత్యాచారం సహా పలు కేసులు నమోదయ్యాయని, సీబీఐకి దొరకకుండా తిరుగుతున్నారని వారు పిటిషన్‌లో తెలిపారు.
అమెరికా పీహెచ్‌డీ చేసిన తమ కుమార్తపై డ్రగ్స్ ప్రయోగించి ఉంటారని పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ .. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13కు వాయిదా వేసింది.
Next Story