కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హీరోయిన్‌ తమన్నాను అరెస్టు చేయాలంటూ పిటిషన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2020 6:41 PM IST
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హీరోయిన్‌ తమన్నాను అరెస్టు చేయాలంటూ పిటిషన్‌

టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా భాటియాను వెంటనే అరెస్ట్ చేయాలంటూ శుక్రవారం ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోసాలకు పాల్పడుతున్న ఆన్‌లైన్‌ యాప్స్‌ను కూడా నిషేధించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ కు సంబంధించిన కొన్ని యాప్స్‌కు సంబందించి వీరిద్దరూ ప్రచారకర్తలుగా ఉన్నారని.. వీటిని నమ్మిన చాలా మంది మోసపోయారని, ఈ విషయంలో బాధ్యతారాహితంగా వ్యవహిస్తున్న విరాట్‌ కోహ్లీ, తమన్నాలను అరెస్టు చేయాలని చెన్నైకి చెందిన సూర్య ప్రకాశ్‌ అనే న్యాయవాది తన పిటిషన్‌ పేర్కొన్నారు.

ఇటీవలే ఓ యువకుడు ఈ ఫేక్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆకేసుకు సంబంధించిన వివరాలను ఈ పిటిషన్‌కు జత చేశాడు. కాగా.. ఈ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా నాలుగు ఇంటికే పరిమితం అయ్యాడు విరాట్‌ కోహ్లి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుండడంతో ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం సమాయత్తం అవుతున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story