ముషారఫ్‌ చనిపోయినా.. శవాన్నే ఉరి తీయండి.. పాక్‌ కోర్టు సంచలన తీర్పు

By సుభాష్  Published on  19 Dec 2019 12:58 PM GMT
ముషారఫ్‌ చనిపోయినా.. శవాన్నే ఉరి తీయండి.. పాక్‌ కోర్టు సంచలన తీర్పు

ముఖ్యాంశాలు

  • తాజాగా బయటకొచ్చిన కోర్టు తీర్పు కాపీ

  • ముషారఫ్‌ను భయపెట్టేలా ఉన్న తీర్పు

  • చనిపోయినా కూడా శవాన్ని ఉరి తీయాలన్న కోర్టు

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ను ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ ద్రోహం కేసులో విచారణ చేపట్టిన స్పెషల్‌ కోర్టు, ఆ తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీ తాజాగా బయటకు వచ్చింది. ఆ కోర్టు తీర్పు కాపీని ముషారఫ్‌ను భయపెట్టేలా ఉంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అందులో ఇద్దరు ముషారఫ్‌నుతోషిగా తేల్చారు. మరో జడ్జీ దాంతో విబేధించారు.ఆ జడ్జీలు 167 పేజీల తీర్పు ప్రతిని అందించారు. అందులో పూర్తి వివరాలు పొందుపర్చారు. 'నిందితుడి మీద వచ్చిన ఆరోపణల ప్రకారం.. ముషారఫ్‌ దోషి.. ఆయన చనిపోయే వరకు ఉరితీయాలి.. పరారీలో ఉన్న దోషిని పట్టుకుని తీరాల్సిందేనంటూ సంబంధిత శాఖ అధికారులకు కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒక వేళ దోషి శవం దొరికితే దాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఆ శవాన్నే ఉరితీయాలంటూ కోర్టు కాపీలో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పుడు కాపీ బయటకు రావడంతో సంచలనంగా మారింది.

కాగా, ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2007లో నవంబర్‌ 3న రాజ్యాంగానికి వ్యతిరేంగా ఎమర్జెన్సీని విధించారు. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్భంధం విధించి, అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించి నానా ఇబ్బందులకు గురి చేశాడు. న్యాయమూర్తులను విధుల నుంచి తప్పించారు. ఇంతటితో ఆగని ముషారఫ్ మీడియాపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకున్న ముషారఫ్‌:

ముషారఫ్‌ పై 2013లో ముషారఫ్‌పై దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. 2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి నాలుగు సంవత్సరాలుగా అక్కడే తలదాచుకుంటున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన కోసం పోలీసులు పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో కోర్టు ఆయనకు సమన్లు పంపింది. అయినా కూడా ముషారఫ్‌ స్పందించకపోవడంతో వెంటనే అరెస్టు చేయాలని ఎఫ్‌ఐకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. గతంలో పాకిస్తాన్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ఇది రెండోసారి.

Next Story