ఆయన నారా బాబు కాదు యూ టర్న్‌ బాబు..!: మంత్రి పేర్ని నాని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Nov 2019 6:09 PM IST
ఆయన నారా బాబు కాదు యూ టర్న్‌ బాబు..!: మంత్రి పేర్ని నాని

అమరావతి: చంద్రబాబు తాను నమ్మిన సిద్దాంతం నుంచి కూడా యూ టర్న్ తీసుకుంటాడంటూ మండిపడ్డారు మంత్రి పేర్ని నాని.

చంద్రబాబు లాగే లోకేష్ కూడా యూ టర్న్ కు అలవాటు పడ్డారని ఎద్దేశా చేశారు. యూ టర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ఎన్టీఆర్ టీడీపీ పట్టినప్పుడు బంగాళాఖాతంలో కలుపుతానని చంద్రబాబు ప్రగల్బాలు పలికారన్నారు. తరువాత యూ టర్న్‌ తీసుకుని చంద్రబాబు పంచన చేరారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనని చెప్పి ..యూ టర్న్ తీసుకొని చంద్రబాబు మళ్లీ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ఫొటో అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఓట్లు కోసం మళ్లీ ఎన్టీఆర్ ఫొటో పెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని..చివరకు ఆ పార్టీతో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు పేర్ని నాని.ఎన్నికలకు ముందు సోనియా, మమతా, స్టాలిన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు వారిని మర్చిపోయారన్నారు. ఎన్నికలకు ముందు మోడీ అమిత్ ను తిట్టిన చంద్రబాబు ఎన్నికల తరువాత యూ టర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళను పొగుడుతున్నారని చెప్పారు.

చంద్రబాబు నవ్వుల పాలయ్యారు

పవన్ నాయుడు గురించి టీడీపీ అభ్యర్థిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం వద్దని ఉద్యమం చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంతానే తెచ్చానని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు ఉండదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు మంత్రి. ఇంగ్లీష్ మీడియంపై ప్రజల నుంచి మద్దతు రావడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకొని మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు కుమారుడు, మనవుడు, కోడలు ఇంగ్లీష్ చదువుకోలేదా అని ప్రజలు ప్రశ్ననిస్తున్నారని తెలిపారు.ఇంగ్లీష్ మీడియంపై రాద్దతం చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారని చెప్పారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబులాగానే పవన్ నాయుడిది యూటర్న్ జీవితమంటూ మండిపడ్డారు మంత్రి పేర్ని నాని.

సుజనా చౌదరి చంద్రబాబు కోవర్ట్..!

సుజనా చౌదరి పార్టీ మారిన తరువాత సుజనా కాల్ డేటా చూస్తే చంద్రబాబు తో ఎన్ని సార్లు మాట్లాడారో తెలుస్తుందన్నారు మంత్రి పేర్ని నాని. సుజనా చౌదరి వంటి ఇంటి దొంగలను బీజేపీ ఎప్పుడు పట్టుకుంటో చూడాలన్నారు. కేంద్రం నిర్వహించే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారన్నారు. సుజనా చౌదరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని మంత్రి ప్రశ్నించారు. బీజేపీకి ఓ సిద్దాంతం ఉంది..సుజనా చౌదరిలాంటి వాళ్లు చేరడం వలన బీజేపీ సిద్దాంతాలు పక్కకుపోయాయన్నారు. బ్యాంక్ లను లూటీ చేసిన ఘనత సుజనా చౌదరిదని విమర్శించారు. చంద్రబాబు చేసే గుంటనక్క రాజకీయాలను ప్రజలు నమ్మరన్నారు. సుజనా చౌదరి ఎందుకు టీడీపీతో టచ్ లో ఉన్నారో చెప్పాలని నిలదీశారు మంత్రి. టీడీపీ నేతలు ఇంటికి సుజనా చౌదరి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. మోడీ గొప్ప తనం గురించి సుజనా చౌదరి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు బీజేపీలోకి సుజనా ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, అన్న క్యాటీన్ లకు పసుపు రంగు వేస్తే పవన్ నాయుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని.

Next Story