ఢిల్లీ : ఆటో మోబైల్ రంగంలో మాద్యానికి కారణం ఓలా, ఊబర్  క్యాబ్ లు అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన  వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎన్.డీ.ఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా  నిర్మలాసీతారామన్  మీడియాతో మాట్లాడుతూ “ఈ తరం యువత కొత్త కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదన్నారు.  ఈ.ఎం.ఐలు భరించే అలోచనలు వారు చేయడం లేదని చెప్పారు.  ఊబర్, ఓలా, మెట్రోలలోనే ప్రయాణించడానికి వారు ఇష్టపడుతున్నారని” అన్నారు.

యువత ఆలోచనా తీరులో వచ్చిన మార్పులే కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం తప్ప, పన్నుల భారం కాదన్నారు నిర్మలాసీతారామన్ . కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె చదువులేని వారిలా మాట్లాడుతున్నారని  ఒకరంటే..మరొకరు “మతి లేదా”అంటూ సెటైర్లు వేశారు. విమర్శలు కొన్ని ఆలోచింపజేసివిగా ఉంటే..కొన్ని నవ్వుకునేలా ఉన్నాయి.

గత 10 నెలలుగా ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీల విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీని వల్ల వేల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లింది. ఆగస్ట్ లో వాహనాల అమ్మకాలు 32 శాతం పడిపోయాయి. దీని ప్రభావం దేశ ఆర్ధిక పరిస్థితిపై కూడా వుంది. ఈ సమయంలో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.