ప్రముఖ మొబైల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేమెంట్..రోజుకు 75 వేల మంది ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది. ” ఇప్పుడు కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల రోజూ లక్షలాది మంది ఆకలితో మగ్గిపోతున్నారు. ఆకలికి భాష లేదు. ఎవరైనా ఒకటే. ఆకలితో ఎవరూ మగ్గిపోకూడదన్న ఉద్దేశంతోనే మేము 75 వేల మందికి అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం. కేవీఎన్ ఫౌండేషన్ తో కలిసి రోజూ 75 వేల మంది వలస కార్మికులకూ, రోజు వారీ కూలీలకు భోజనం పెడుతున్నాం” అని పేటీఎం సంస్థ ఇన్ స్టా లో తెలిపింది. నోయిడా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారం అందజేస్తోంది పేటీఎం సంస్థ.

Also Read : బాలిలో చిక్కుకుపోయిన భారతీయులు

కేవీఎన్ ఫౌండేషన్ feed my city పేరుతో మార్చి 27వ తేదీ నుంచి బెంగళూరులో ఉపాధి కోల్పోయిన 500 మందికి ఆహారం అందిస్తోంది. రానున్న రోజుల్లో 30 లక్షల మంది ఆకలిని తీర్చడమే తమ లక్ష్యంగా చెబుతోంది. కానీ..ప్రస్తుతం ఆకలితో ఉన్నవారందరినీ గుర్తించి ఆహారం అందించలేకపోవచ్చు..అందుకే మీ సామర్థ్యం మేరకు మీకు దగ్గర్లో ఆకలితో అలమటిస్తున్నవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చండంటూ కేవీఎన్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది.

Also Read : కరోనా కంటే ఆ రోగం ప్రమాదకరమైంది.. తెలంగాణ సర్కార్‌కు కొత్త తలనొప్పి

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.