బాలిలో చిక్కుకుపోయిన భారతీయులు

By రాణి  Published on  8 April 2020 1:04 PM GMT
బాలిలో చిక్కుకుపోయిన భారతీయులు

కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా..ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో సుమారు 80 మంది భారతీయులు చిక్కుకుపోయారు. గత నెల 17వ తేదీన ఇండియాకి వచ్చేందుకు వీరంతా రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోగా.. లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ విమానాల రాకపోకలు నిలిపివేయడంతో అవి కాస్తా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో వారంతా అక్కడి ఇండియన్ ఎంబసీని కలిసి పరిస్థితిని వివరించగా వారందరూ ఉండేందుకు బ్రహ్మపుత్రి ఆశ్రమాన్ని కేటాయించారు. కానీ..అంతా కలిసి ఒకే ఆశ్రమంలో ఉంటే..వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది మిగతా వారికి సోకే ప్రమాదముందని గ్రహించి విడివిడిగా హోటల్స్ లో రూమ్ లు తీసుకున్నారు. ఇప్పుడు రూమ్ లలో ఉండేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని..వెంట తెచ్చుకున్న డబ్బంతా హోటల్ బిల్లులకే ఖర్చయిందని పేర్కొంటూ వీడియో సందేశాలు పంపారు. తమ పరిస్థితిని గ్రహించి భారత ప్రభుత్వం సహాయమందించాలని కోరుతున్నారు.

Also Read : ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా లేదా ? కారణమేంటి ?

బాలిలో చిక్కుకుపోయిన వారిలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. హైదరాబాద్ వాసులు 5, విజయవాడ 5, తిరుపతి కి చెందిన ఇద్దరు బాలిలో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ కు చెందిన పవన్ మాట్లాడుతూ.. '' నేను హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ తో కలిసి 10 రోజులు టూర్ కు వచ్చాను. ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ టికెట్స్ బుక్ చేసుకునే పరిస్థితి లేదు. ఇండియాని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 80-100 మంది ఇక్కడ చిక్కుకుపోయారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మేముంటున్న హోటళ్లను కూడా ఖాళీ చేయమంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయించి వేరే రూమ్ చూసుకోమంటున్నారు. ఇప్పుడు మా వద్ద డబ్బు కూడా లేదు..కానీ మా అదృష్టం కొద్దీ ఇక్కడున్న న్యూ ఢిల్లీ ఇండియన్ రెస్టారెంట్ ఓనర్ రవి మా కష్టాన్ని గుర్తించి మూడు పూటలా మా కోసం ఫుడ్ పంపిస్తున్నారు. ఇక్కడున్నకౌన్సిలర్ జర్నల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మార్చి 17 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. దయచేసి వీలైనంత త్వరగా మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్లండి '' అని వీడియోలో మొరపెట్టుకున్నాడు.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-08-at-6.17.18-PM.mp4"][/video]

Next Story