ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా లేదా ? కారణమేంటి ?

By రాణి  Published on  8 April 2020 11:50 AM GMT
ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా లేదా ? కారణమేంటి ?

ఉత్తర కొరియా..ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ఇంతవరకూ ఉత్తరకొరియాను తాకలేదా ? ఒక వేళ ఆదేశ ప్రజలకు కరోనా వచ్చినా రహస్యంగా చంపేస్తున్నారా ? లేక బాహ్య ప్రపంచానికి తెలియకుండా చికిత్స అందిస్తున్నారా ? ప్రస్తుతం మిగతా దేశాల మెదడును తొలుస్తున్న ప్రశ్నలివి. నిజంగానే అక్కడ కరోనా వైరస్ రాకపోయుంటే ఆ దేశం ప్రజలను ఎలా అప్రమత్తం చేసింది. వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి ఏం చెప్తోంది ?

Also Read : కరోనాతో 14 నెలల బాలుడు మృతి

ఇప్పటివరకూ తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కానీ, అక్కడి అధికారులు కొన్ని వారాలుగా పరిమిత స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఉత్తరకొరియా ప్రభుత్వం. ఎవరికైనా కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్లను సంప్రదించకుండా ఎలాంటి మందులూ వేసుకోవద్దని హెచ్చరించింది. అలాగే సొంతంగా యాంటీబయోటిక్స్ కూడా వాడొద్దని చెప్పింది.

Also Read : పాలు తాగాడని కొడుకుని చంపి తండ్రి ఆత్మహత్య..

ఆల్కహాల్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి..ప్రపంచంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టేవరకూ ఎవరకూ దాని జోలికెళ్లద్దని సూచించిందట. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సంప్రదాయ బద్ధమైన ఆహారాన్ని తినాలని..ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లి, తేనె తీసుకోవాలని తెలిపింది. ఇదేంటి..మనకేమో వెల్లుల్లి తినడం వల్ల కరోనా ఏం తగ్గదు అని చెప్పారు అనుకుంటున్నారా ? కరోనా తగ్గదు..కానీ వెల్లుల్లి వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇకపోతే..ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతిసారి మాస్కులను తప్పనిసరిగా ధరించాలని..వాటిని తరచూ మార్చుకుంటుండాలని ఆ దేశ ప్రజలకు సూచించింది ఉత్తరకొరియా ప్రభుత్వం.

Next Story