లాక్‌డౌన్‌లో హీట్ పెంచుతున్న భామలు.. కుర్రకారుకి నిద్రకరువు
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 4:03 PM IST'ఆర్ఎక్స్ 100' సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్‌పుత్. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ.. మాల్స్ ఓపెనింగ్‌లో పుల్ బిజీగా ఉంది అమ్మడు. అయితే.. లాక్‌డౌన్ పుణ్యమా అని ఇంటికే పరిమితమైంది. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తోంది. తన మేధస్సును ఉపయోగించి రకరకాల డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటోంది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ముద్దుగుమ్మ.
నిన్న పిల్లో ఛాలెంజ్.. అంటూ ఎల్లో పిల్లోను ఒంటికి డ్రెస్‌గా ధరించి అందాలు ఆరబోసిన అమ్మడు.. నేడు ఏకంగా పేపర్ డ్రెస్స్ అంటూ సందడి చేసింది. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఓ పోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలో ఓ న్యూస్ పేపర్ డ్రెస్ లాగా ఒంటికి చుట్టుకుంది. ఈ ఫోటోకు "నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? ప్రతి డ్రెస్ విభిన్నంగా ఉంటుంది #madewithstyle." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేపర్ డ్రెస్ కొత్తేమీ కాదు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహా నా పెళ్లంట సినిమా హీరో రాజేంద్రప్రసాద్ డబ్బులు ఆదా చేయడం కోసం న్యూస్ పేపర్ ను లుంగి లాగా కట్టుకుని అందరిని నవ్వించాడు. ఇటీవల ఆదాశర్మ సైతం పేపర్ డ్రెస్‌ను ధరించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది.
ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ఈ భామలు తమ హాట్ ఫోటోలతో లాక్‌డౌన్‌ను మరింత హీట్ ఎక్కిస్తున్నారు. ఈ ఇద్దరికి తరువాత పేపర్ డ్రెస్‌తో ఏ భామ సందడి చేయనుందో చూడాలి.