'చిరు' దోశ‌లు.. మంత్రి కేటీఆర్ నామినేట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2020 5:48 AM GMT
చిరు దోశ‌లు.. మంత్రి కేటీఆర్ నామినేట్

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం 'బి ది రియ‌ల్ మ్యాన్' ట్రెండ్ కొన‌సాగుతోంది. ఇంటి ప‌నుల్లో ఆడ‌వారికి సాయం చేయాలంటూ 'అర్జున్ రెడ్డి' ద‌ర్శ‌కుడు సందీప్ వంగ బీ 'ది రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్ ను ప్రారంభించాడు. ఇప్ప‌టికే ఈ ఛాలెంజ్‌ను రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, కీర‌వాణి లు స్వీక‌రించి కంప్లీట్ చేశారు.

ఇక‌ మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఈ ఛాలెంజ్ పుణ్య‌మా అని మెగాస్టార్ దోశ‌లు ఎలా వేస్తారో చూసే ఛాన్స్ అభిమానుల‌కు ద‌క్కింది. ఈ వీడియోలో చిరంజీవి ఇల్లు శుభ్రం చేయ‌డంతో పాటు త‌న త‌ల్లి అంజ‌నాదేవికి పెస‌ర‌ట్టు ఉప్మా వేసి ఆమెకు ఆప్యాయంగా వ‌డ్డించారు.

'భీమ్‌( ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు)నువ్వ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించారు. నేను రోజూ చేసే ప‌నులే. ఈ రోజు మీ కోసం ఈ వీడియో సాక్ష్యం' అని చిరంజీవి పేర్కొన్నాడు. ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్‌, ర‌జ‌నీకాంత్‌ను నామినేట్ చేశాడు చిరు.Next Story
Share it