అవును.. పవన్ ఆ సినిమా చేస్తున్నాడు

By సుభాష్  Published on  2 Sep 2020 10:38 AM GMT
అవును.. పవన్ ఆ సినిమా చేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మామూలు స్పీడు మీద లేడు. గత ఏడాది చివర్లో రీఎంట్రీ సినిమా మొదలుపెట్టిన పవన్.. 2024 ఎన్నికలకు ఏడాది ముందు వరకు విరామం లేకుండా, సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. పవన్ ఆల్రెడీ రెండు సినిమాలు మొదలుపెట్టి, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఇంకో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇటీవలే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ పట్ల కూడా పవన్ ఆసక్తి చూపించినట్లు వార్తలొచ్చాయి. ఇంతలో అనూహ్యంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ మిత్రుడు రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అప్ డేట్ బయటికొచ్చింది. దీని విషయంలో ఇండస్ట్రీ వర్గాలు పక్కా సమాచారంతో ఉన్నట్లు కనిపించింది.

అయినప్పటికీ పవన్ నిజంగా ఈ సినిమా చేస్తాడా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఆ సందేహాలకు బుధవారం తెరపడింది. పవన్ ఈ సినిమా పక్కాగా చేయబోతున్నట్లు వెల్లడైంది. నిర్మాత రామ్ తాళ్ళూరి.. సురేందర్ రెడ్డితో కలిసి పవన్‌కు విషెస్ చెబుతూ ఈ కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని చెప్పకనే చెప్పేశాడు. అలాగే మీడియా వాళ్లకు కూడా ఈ కాంబినేషన్ గురించి సమాచారం ఇవ్వడంతో ‘పీఎస్పీపీకే 29’ పేరుతో ఈ చిత్రాన్ని సంబోధిస్తూ ట్వీట్లు కూడా పడిపోయాయి. కాబట్టి ఇటీవలి ప్రచారం నిజమే అన్నమాట. సురేందర్‌తో కలిసి ఒకప్పుడు కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు కథలు అందించిన వక్కంతం వంశీనే దీనికీ కథ రాశాడు. పవన్‌కు ఎంతో సన్నిహితుడైన రామ్.. నేల టిక్కెట్టు, డిస్కో రాజా లాంటి డిజాస్టర్లతో బాగా దెబ్బ తిన్నాడు. ఈ నేపథ్యంలో అతణ్ని ఆదుకోవడం కోసం పవన్ ఈ సినిమా చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి.. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

పవర్ స్టార్ బర్త్ డే కానుకగా #PSPK27 ప్రీ లుక్ పోస్టర్

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

‘వకీల్‌సాబ్‌’ మోషన్‌ పోస్టర్‌ వచ్చేంది

Next Story