కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా మహారాణా ప్రతాప్ ను దూషించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. 'టిప్పు సుల్తాన్ ను మీరెవరైనా దూషిస్తే.. తాము మహా రాణా ప్రతాప్ ను దూషిస్తామంటూ' ఆయన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ పోస్టులు చాలా వరకూ హిందీలో ఉన్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
దీంతో పవన్ ఖేరాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పెద్ద ఎత్తున నెగటివ్ కామెంట్లు వస్తూ ఉన్నాయి.
నిజమెంత:
ఈ ఘటనలో నిజమెంత అని తెలుసుకోడానికి న్యూస్ మీటర్ ‘Pawan Khera on Tipu Sultan' అనే కీవర్డ్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. దైనిక్ భాస్కర్ న్యూస్ సంస్థ హిందీలో ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. ‘Pawan Khera says the message shared on social media is fake.’ మహా రాణా ప్రతాప్ ను తాను దూషించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును ఆయన ఖండించారు.
ఆ ఆర్టికల్ లో తాను మహా రాణా ప్రతాప్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. ఆయన్ను దూషించనూ లేదని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పచ్చి అబద్దమని... ఈ వార్తను ఎవరైతే వైరల్ చేస్తున్నారో వారిపై కేసు పెడతామని ఆయన అన్నట్లు ఆ వార్తలో ప్రచురించారు.
నవంబర్ 2018లో ఆ ఆర్టికల్ ను ప్రచురించడం జరిగింది. అప్పటి వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ ఖేరా కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో మరోసారి.. నేను మహా రాణా ప్రతాప్ ను ఏమీ అనలేదని.. అనవసరంగా అబద్ధపు వార్తను ప్రచారం చేస్తున్నారని అన్నారు.
�
నేను ఎప్పుడు మహా రాణా ప్రతాప్ ను దూషించానో మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి. నేను అలా మాట్లాడి ఉంటే క్షమాపణలు కోరడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వాళ్లపై తప్పకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయిస్తాను. గతంలో ఇలాంటి ట్వీట్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అని అన్నారు.
నిజమేమిటంటే: నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా 'టిప్పు సుల్తాన్ ను మీరెవరైనా దూషిస్తే.. తాము మహా రాణా ప్రతాప్ ను దూషిస్తామంటూ' అన్నారంటూ వైరల్ అవుతున్న ట్వీట్ పచ్చి అబద్ధం. ఇందుకు సంబంధించి ఎటువంటి వీడియో, ఆడియో, కనీసం పేపర్ లో వార్త కూడా రాలేదు. వైరల్ అవుతున్న ట్వీట్ అంతా అబద్ధమే.