అమరావతి వీధుల్లో నడుస్తా..ఎవరు ఆపుతారో చూస్తా: పవన్ కల్యాణ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2019 7:30 PM ISTముఖ్యాంశాలు
- వైఎస్ జగన్ పాలన అద్భుతంగా ఉంటే సినిమాలు చేసుకుంటా
- ఖాళీగా ఉంచినందుకు భవన నిర్మాణ కార్మికులకు రూ.50వేలు
- చనిపోయిన భవన నిర్మాణ కుటుంబాల వారికి రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా
- రెండు వారాల్లోగా చెల్లించాలన్న జనసేనాని
- మంత్రులు కన్నబాబు, బొత్సపై పవన్ కల్యాణ్ ఫైర్
- విజయసాయికి తనను విమర్శించే అర్హతలేదన్న పవర్ స్టార్
విశాఖ:చంద్రబాబు దత్త పుత్రుడిని అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారంటే ప్రభుత్వం సరిగా పని చేయడంలేదని అర్ధమన్నారు. ప్రజలు సరాదా కోసం రోడ్డు ఎక్కడం లేదని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. బలమైన భావజాలంతో పార్టీ పెట్టానని చెప్పారు పవన్ కల్యాణ్.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచామన్నారు. కోట్లు సంపాదించడానికి పార్టీ పెట్టలేదని చెప్పారు. తుదిశ్వాస వరకు పార్టీ నడుపుతానని గర్జించారు. వైసీపీ నేతలు తనకు శత్రువులు కాదంటూనే నిప్పులు చెరిగారు. ముఖ్యంగా మంత్రులు కన్నబాబు, బొత్సాలపై మండిపడ్డారు. కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చింది నాగబాబు అని తెలిపారు .ఈ రోజు మంత్రులై ఏదిబడితే అది మాట్లాడుతున్నారన్నారుని చెప్పారు.
36 మంది భవన కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీసీ పాలనలో రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందన్నారు. కోట్ల సంపాదన వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు పవన్ కల్యాణ్. అధికారం కోసం డబ్బులు వెదజల్లే వ్యక్తిని కాదన్నారు. టీడీపీ ఇసుక ఫాలసీలో తప్పులుంటే సరిదిద్దాలి కాని...లేట్ చేయడం మంచిదికాదన్నారు.
ప్రతి ఒక్క భనవ కార్మికుడికి రూ.50వేలు చెల్లించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. రెండు వారాల్లోగా చెల్లించకపోతే.. అమరావతి వీధుల్లో నడుస్తా..ఎవరు ఆపుతారో చూస్తానన్నారు పవన్ కల్యాణ్.
విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడనన్నారు. షూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయి కూడా తనను విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. విజయపాయికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. పరిధి దాటితే తాటా తీస్తామన్నారు. వైసీపీ నేతలు కళ్లు నెత్తికెక్కిమాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతే భయపడతామా..? వైసీపీ స్థాయి ఎంత ..వైసీపీ సత్తా ఎంత వైసీపీకి రెండు వారాలు గడువిస్తున్నాం.
మరోవైపు పవన్ సభలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఇద్దరు యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.