సీఎం వైఎస్ జగన్‌కు పవన్ కల్యాణ్ ప్రశ్నలు..!!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 25 Oct 2019 3:26 PM IST

మంగళగిరి: రాజధాని ఎక్కడో కచ్చితంగా చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక లేక లక్షల మంది కార్మికులు బాధ పడుతున్నారని చెప్పారు. ఇసుక లారీల యజమానులు పవన్ కల్యాణ్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. లారీ ఓనర్లతో మాట్లాడక పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు . ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యంగ్యంగా మాట్లాడటాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. రాజధాని ఉందో లేదో అని బొత్స అనడంపై తీవ్రంగా మండిపడ్డారు .హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడంలేదు. సరైన వసతులు లేవన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
Next Story