ఒంగోలు: సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రాజెక్టులు గురించి బలంగా మాట్లాడలేక పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. సీఎంకు సీబీఐ కేసుల భయం పట్టుకుందన్నారు. కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. చిన్నాన్నను కిరాతకంగా హత్య చేస్తే ఏం తేల్చలేకపోయారని విమర్శించారు. వైఎస్ వివేకానంద కేసును సీబీఐకు ఇవ్వాలని ..ఇప్పుడు ఆ దిశగా ఎందుకు వెళ్లడంలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.