మా పార్టీ వారిని మాత్రమే చూసుకుంటామంటే ఎలా..?!- ట్విటర్ లో పవన్ కల్యాణ్
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 28 Oct 2019 12:09 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి ట్విటర్ లో మండిపడ్డారు జనసేనాని పవన్ కల్యాణ్. మా పార్టీ వారిని మాత్రమే చూసుకుంటాం... మిగిలిన వారిని రోడ్డుకు ఈడుస్తామంటే ఎలా అంటూ ట్విటర్ లో సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లతో లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంతకు ఐదింతల మంది భవన కార్మికులను రోడ్డున పడేశారంటూ ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ వారిని మాత్రమే చూసుకుంటాం..మిగిలిన వారిని రోడ్డున పడేస్తామంటే ఎలా అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అయితే..పవన్ కల్యాణ్ తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు, మంత్రులు, అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ కు తెలిసిన పని వైఎస్ జగన్ ను విమర్శించడమేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అటువంటి పోస్ట్ ను మీరు కింద చూడొచ్చు.
�
Next Story