టీడీపీ కాలయాపన చేస్తే..వైసీపీ దౌర్జన్యం చేస్తోంది : పవన్ కల్యాణ్
By రాణి Published on 12 March 2020 5:19 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గ్రామ స్వరాజ్యం కావాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గతంలో టీడీపీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తే..ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదలయ్యేసరికి వైఎస్సార్సీపీ దౌర్జన్యం చేస్తోందని వాపోయారు.
Also Read : రూ.250 నాణేన్ని విడుదల చేసిన ఆర్బీఐ..కేవలం వారికోసమే
ప్రజాస్వామ్యం పట్ల వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని, ఏ జిల్లాలోనూ విపక్షాల సభ్యులు నామినేషన్ వేసే పరిస్థితుల్లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. వైసీపీలో 151 మంది సభ్యులుండగా..ఎందుకింత భయపడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ తీరును చూస్తూ కూడా ఎలక్షన్ కమిషన్ ఏమీ ఎరుగనట్లుండటం చాలా దారుణమన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఎలాంటి చర్య తీసుకోకపోతే..ఫ్యాక్షన్ ను సమర్థించినట్లేనన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నేర పూరిత రాజకీయాలు ఎక్కువకాలం సాగవని, జనసేన, బీజేపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
Also Read : 86వేల మంది ఉన్న గ్రౌండ్‌లోకి కరోనా బాధితుడు.. అక్కడంతా టెన్షన్.. టెన్షన్
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..అధికార పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ధోరణి సరిగ్గా లేదని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుని మేలుకోవాలన్నారు. ఈ అరాచకాలకు ముగింపు పలకాలంటే..స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని కన్నా కోరారు. వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికల్లో నిలబడగలరా ? అని ప్రశ్నించారు. మీ ఆర్డినెన్స్ తప్పి మీ పార్టీ నేతలే డబ్బు, మద్యం పంచితే మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతారా ? అని కన్నా సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. అనంతరం పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ కలిసి విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు.