అయ్యో.. పవన్ కు ఆ జబ్బు ఉందా ?
By రాణి Published on 22 Jan 2020 7:29 PM ISTసినిమాల్లో అతను పవర్ స్టార్ కళ్యాణ్. అలాగే రాజకీయంలోకి వచ్చాక కూడా పవర్ లోకి వస్తే ఆ స్టార్ డమ్ బావుండేదేమో. కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని కాదనుకుని.. రాజకీయాల్లోకి వచ్చానని సగర్వంగా పదే పదే డైలాగ్ లు చెప్పారు... కానీ చివరికీ డబ్బులు కోసం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు. సరే మనోడు మాట నిలబడదులే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోతే ఏం అనుకోవాలి. ఒక్కమాటలో పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ గా నిలిచాడు. అయినా రాజకీయ నాయకుల్లో ఎవరైనా తమ పర్సనల్ విషయాల కన్నా తమ పనితనం గురించి, ప్రతి పక్షాల వైఫల్యాల గురించి ఎక్కువగా చెబుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ లా ఎవ్వరూ సొంత డబ్బా కొట్టుకోరు. ఈ డిజిటల్ యుగంలో డబ్బా కొట్టుకున్నా ఉపయోగం లేదనే కనీస అవగాహన ఉంటుంది ఎవరికైనా. కానీ కళ్యాణ్ బాబుకు మాత్రం పాపం ఆ అవగాహన కూడా లేదాయే. సమావేశం ఏదైనా తన సొంత సుత్తి కొట్టాల్సిందే.
ఆ మాట కొస్తే తనకన్నా గొప్ప రాజకీయ నాయకుడు లేడన్న ఆలోచననే పవనం బాబు ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కళ్యాణ్ బాబు కొన్ని విషయాలను గురించి కాస్త వివరంగా సెలవిచ్చారు. ఆ విషయాలు ఏమిటి అనే విషయం పక్కన పెడితే.. ఇలాంటి వారు కూడా రాజకీయాలు మారుస్తా అనడం నిజంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమేనంటున్నారు కొంతమంది. రాజధాని మీద సీజన్ కి ఒక్కో అభిప్రాయం.. ఒక్కో స్థలంలో ఒక్కోలా స్టేట్ మెంట్లు.. ఒక క్లారిటీ లేదు, ఒక్క విజన్ లేదు, విషయ అవగాహన ఎలాగూ లేదు, కనీసం విషయ పరిజ్ఞానం కూడా లేకుండా పోయింది. అయితే పవన్ కళ్యాణ్ ను దగ్గరిగా చూసిన రవితేజ లాంటి కొందరు పవన్ కు ఇన్ ఫిరియార్టీ కాంప్లెక్స్ తో పాటు ఊహాలోకంలో మునిగిపోయి వాస్తవికతను అర్ధం చేసుకోలేని వీక్ నెస్ లాంటి జబ్బు కూడా ఉందని చెబుతున్నారు. అందుకే తాను ఏం మాట్లాడుతున్నానో అని పవన్ కు సరైన అవగాహన కూడా ఉండదని అంటున్నారు.
అందుకు తగ్గట్లుగానే.. అసలు తాను రాజకీయాల్లో ఏం చేయాలి అనుకుంటున్నాడో, తమ అజెండా ఏమిటో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా క్లుప్తంగా చెప్పిన దాఖలాలు లేవు. రెగ్యూలర్ గా పవన్ స్పీచ్ లను ఫాలో అయ్యేవారికి పవన్ మాటలు పూర్తి కల్పితంగా అనిపిస్తాయి. ప్రతి సమావేశంలోనూ అవే డైలాగ్ లు.. కనీసం కొత్త కంటెంట్ చెప్పినా ఫ్యాన్స్ అయినా హ్యాపీగా ఫీల్ అయేవాళ్లు. ఇన్నేళ్ళలో పాపం వాళ్లకు ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. మొత్తానికి పవన్ రాజకీయాల్లో ఒక డిజాస్టర్ పర్సన్, మరి సినిమాల్లో అన్నా హిట్ కొడతాడా లేక అజ్ఞాతవాసిలా కనుమరుగైపోతాడా చూడాలి.